29/10/2026, Thursday · 03:34:01 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ.

Teegala sravan Kumar 29/10/2026 2:37 PM రాజన్న సిరిసిల్ల 9

రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ.
Want this news as a newspaper clip?Print News Clip
  • జిల్లాలోని 07 ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 29, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. జిల్లా పరిదిలో మొత్తం 07 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్ఠంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడం అత్యంత కీలకమని ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య చికిత్స అందేలా సహకరించాలని ప్రజలకు సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు.రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని, ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.అదేవిధంగా, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి :: గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

Accident VictimsRoadAdvantageRahatSchemeDistrict

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

5 Posts

Latest News

గ్రామాల్లో కనిపించని MPTC, ZPTC ఎన్నికల ప్రచారం! పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం. తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! సిరిసిల్లలో ‘సంపూర్ణేష్ బాబు’ సందడి! అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలి. వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవం సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు తాండూరు కందులకు అంతర్జాతీయ గుర్తింపు: ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 500కు పైగా ట్రాఫిక్ కేసులు నమోదు