28/10/2026, Wednesday · 10:43:13 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలి.

Teegala sravan Kumar 28/10/2026 9:06 PM రాజన్న సిరిసిల్ల 9

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • ఐదు నెలలుగా ముగ్గురు ఉద్యోగులకు అందని జీతాలు..
  • ఆరోగ్యలక్ష్మి బిల్లులు, ఇంటి అద్దెలు, బీఎల్‌ఓ పారితోషికాల చెల్లింపులపై రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రస్తావన

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 28 , కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి. 

 రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అంగన్‌వాడీ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత, ప్రధాన కార్యదర్శి కొండికొప్పుల పద్మ, కోశాధికారి ఓరుగంటి శ్యామలతో పాటు వేములవాడ ప్రాజెక్టు నుంచి జిల్లా సభ్యులు అంజలి, పద్మ, వజ్రలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత మాట్లాడుతూ.. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆరోగ్యలక్ష్మి బిల్లులు, ఇంటి అద్దెల చెల్లింపులు, బీఎల్‌ఓ విధులు నిర్వహించినందుకు రావాల్సిన పారితోషికాల సమస్యలను రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో ముగ్గురు ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను ఐసీడీఎస్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇంటి అద్దెలు, బీఎల్‌ఓ పారితోషికాలు, నిలిచిపోయిన జీతాలను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

ofAnganwadi TeachersProblemsAayasaddressed

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

4 Posts

Latest News