29/10/2026, Thursday · 04:31:43 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

రామగుండం పోలీస్ కమిషనరేట్

Katta Ravinder 29/10/2026 3:42 PM మంచిర్యాల 20

రామగుండం పోలీస్ కమిషనరేట్
Want this news as a newspaper clip?Print News Clip
  • రక్తదానం ప్రాణదానంతో సమానం..ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని,ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ఎస్‌ఐ భూమేష్, పోలీస్ అధికారులు,పెగడపల్లి గ్రామం నుండి RSR టీమ్ మెంబెర్స్ మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ఉప సర్పంచ్‌తో పాటు పలువురు యువకులను సీపీ అభినందించారు.రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని,ఆరోగ్యపరంగా అర్హత ఉన్న వారు స్వచ్ఛందంగా క్రమం తప్పకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని సీపీ కోరారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు,జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐ భూమేష్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ

Police CommissionerateRamagundam

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

58 Posts

Latest News

కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ. గ్రామాల్లో కనిపించని MPTC, ZPTC ఎన్నికల ప్రచారం! పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం. తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! సిరిసిల్లలో ‘సంపూర్ణేష్ బాబు’ సందడి! అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలి. వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవం సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు