29/10/2026, Thursday · 04:47:42 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

Katta Ravinder 29/10/2026 3:57 PM మంచిర్యాల 18

కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!
Want this news as a newspaper clip?Print News Clip
  • కరువు మండలాల జాబితాలో కాసిపేటకు చోటు కల్పించకపోవడంపై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం | తెలుగు K24 న్యూస్ | ప్రతినిధి కాసిపేట

కాసిపేట: కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కాసిపేట ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కాసిపేట మండలానికి చోటు కల్పించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కాసిపేటను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.కరువు పరిస్థితుల నేపథ్యంలో మండల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాసిపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చి, అర్హులైన రైతులకు ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో కాసిపేట మండల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ టెంకి వాసుదేవ్‌, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కాసిపేట మండల కార్యదర్శి మోటూరి వేణు, కాసిపేట గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, ముత్యంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ బోయిని తిరుపతి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు లంక లక్ష్మణ్‌, జాడి రాంచందర్‌, అచ్యుతరావు, గుమాస సుధాకర్‌, దుర్గం రవి, కాసిపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు నిచ్చకొల్ల శంకర్‌ తదితరుల

ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ

Kasipeta Mandaldeclareddroughtzone

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

58 Posts

Latest News