30/10/2026, Friday · 08:36:38 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి.

Teegala sravan Kumar 30/10/2026 7:21 PM రాజన్న సిరిసిల్ల 1

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • పోక్సో కోర్టు ప్రత్యేక జిల్లా న్యాయమూర్తి రాధిక జైస్వాల్.

సిరిసిల్ల పట్టణం , అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని, బాలలపై జరిగే లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి వేధింపులు లేదా అనుచిత ప్రవర్తన ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని పోక్సో కోర్టు ప్రత్యేక జిల్లా న్యాయమూర్తి రాధిక జైస్వాల్ అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు .పి.నీరజ సూచనలతో బాలల హక్కులపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పేరుతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల స్థాయి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే విధించే శిక్షలు, బాలల చట్టపరమైన హక్కులు, రక్షణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కార మార్గాల గురించి వివరించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, అనుచిత ప్రవర్తనను గుర్తించడం గురించి తెలిపారు.

అదేవిధంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె యొక్క ఉపయోగం, దాని నిర్వహణ మరియు ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించి, తమకు ఎదురయ్యే వేధింపులు, దుర్వినియోగం లేదా భద్రతకు సంబంధించిన సమస్యలను నిర్భయంగా ఫిర్యాదుల పెట్టె ద్వారా తెలియజేయవచ్చని ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండటం ఎంతో అవసరమని, పిల్లలపై జరిగే నేరాలను నివారించడం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సమిష్టిగా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం మరియు అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కారాల గురించి వివరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారు అందించిన అవగాహన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.బాలల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత.., బాలల హక్కులను కాపాడుతూ, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కార్యక్రమంలో పేర్కొన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు .ఎన్. రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది కల్యాణ్ చక్రవర్తి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్, కుంట శ్రీనివాస్,కళ్యాణి, జైశ్వర్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి.
పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి.
పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి.

personal safetystudentawareprotectionchildrenrights

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

13 Posts

Latest News

రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు.. వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం కాళేశ్వర ఆలయ ఈవో తీరుపై సర్పంచ్ ఆగ్రహం గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్ టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి. చెప్పాం.. చేస్తున్నాం.. చేస్తాం!-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యపై దృష్టి సారించి , చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి :సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు