రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు.

- క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ.
సిరిసిల్ల పట్టణం, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు రోజులుగా నిర్వహించిన రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో సిరిసిల్ల పోలీస్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.గురువారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌ఐ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన సిరిసిల్ల జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచి రన్నరప్‌గా నిలిచింది.ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే జట్టు సభ్యులను అభినందించారు.క్రీడలు , శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమిష్టి కృషి, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు మధుకర్, సురేష్, రమేష్, ఆర్.ఎస్.ఐ దిలీప్, శ్రీనివాస్, క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












