30/10/2026, Friday · 07:53:17 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..

Teegala sravan Kumar 30/10/2026 6:56 PM రాజన్న సిరిసిల్ల 1

అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..
Want this news as a newspaper clip?Print News Clip
  • లైన్‌మెన్ ను ఢీకొట్టిన లారీ

రాజన్న సిరిసిల్ల :జిల్లా కేంద్రంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తాలో ఒక లైన్‌మెన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదానికి మున్సిపల్ కమిషనర్, ఆర్అండ్బి (R&B) అధికారులే పూర్తి బాధ్యత వహించాలి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఇక్కడ చెట్లు అడ్డంగా పెరిగిపోయాయి. దానికి తోడు 45 డిగ్రీల మలుపు ఉన్న ఈ రోడ్డులో ఎదురుగా అటు నుండి వచ్చే వాహనాలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అడ్డుగా ఉన్న చెట్లు తొలగించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఆ రోడ్డులో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..

Road AccidentsNegligenceOfficers

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

13 Posts

Latest News

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం కాళేశ్వర ఆలయ ఈవో తీరుపై సర్పంచ్ ఆగ్రహం గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్ టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి. చెప్పాం.. చేస్తున్నాం.. చేస్తాం!-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యపై దృష్టి సారించి , చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి :సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు