ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి

- ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 29, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మండలాల వారిగా సమీక్ష చేశారు. జిల్లాలో ఇప్పటిదాకా 6,465 ఇండ్లకు ముగ్గు పోశామని, 5,479 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో, 4, 858 ఇండ్లు గోడల లెవెల్ లో, 4,585 స్లాబ్ లెవెల్ లో, 3,934 ఇండ్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.ముగ్గు పోసిన వారితో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, త్వరితగతిన నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కింద మంజూరు అయిన ఇండ్ల పై ఆరా తీసి.. వాటి పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఎంపీడీఓ ఇండ్ల పురోగతిని పరిశీలించాలని సూచించారు. పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు హౌసింగ్ ఏఈలు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని, లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమావేశమై వేగంగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా వివరించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఇండ్ల నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ












