30/10/2026, Friday · 07:49:51 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.

Teegala sravan Kumar 30/10/2026 6:59 PM రాజన్న సిరిసిల్ల 1

ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
  • తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి. 

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు.తంగళ్ళపల్లి మండలం స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు.

ప్రజల్లో భద్రతాభావం కల్పించడంలో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని,అధికారులు,సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, చోరీలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా విస్తృత స్థాయిలో గ్రామాల్లో, విద్యాసంస్థలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. 

ఎస్పీ  వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ నాగేశ్వరరావు, ఎస్.ఐ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.
ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.

police servicesTransparentprovidedpeople

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

13 Posts

Latest News

పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు.. వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం కాళేశ్వర ఆలయ ఈవో తీరుపై సర్పంచ్ ఆగ్రహం గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్ టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి. చెప్పాం.. చేస్తున్నాం.. చేస్తాం!-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యపై దృష్టి సారించి , చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి :సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు