29/10/2026, Thursday · 09:16:14 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పీహెచ్‌సీలలో వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Teegala sravan Kumar 29/10/2026 8:10 PM రాజన్న సిరిసిల్ల 1

పీహెచ్‌సీలలో వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
Want this news as a newspaper clip?Print News Clip
  • డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
  • గంభీరావుపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 29, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ గురువారం పోతుగల్, లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న వైద్య సేవలను, వివిధ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, పలు సూచనలు చేశారు.

ఎల్‌సీడీసీ సర్వే నాణ్యతతో నిర్వహించాలి

జిల్లాలో కొనసాగుతున్న ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేను నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించాలని, ఇంటింటి సర్వే ద్వారా కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించి, నిర్ధారణ పరీక్షలు, అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, లక్ష్యాలను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

మాతా శిశు ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలిగర్భిణీలను ముందుగానే నమోదు చేసి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఐఎఫ్‌ఏ (ఐరన్ ఫోలిక్ యాసిడ్) మాత్రలను క్రమం తప్పకుండా అందించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచి, సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. తల్లి, శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని, రొటీన్ ఇమ్యునైజేషన్‌లో 100 శాతం లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీకాలు పొందని పిల్లలను గుర్తించి, వారికి టీకాలు అందించేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.టీబీ వ్యాధి అనుమానితులను ముందుగానే గుర్తించి, అవసరమైన పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన ప్రతి రోగికి వెంటనే చికిత్స ప్రారంభించి, చికిత్స పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. చికిత్స మధ్యలో ఆపకుండా రోగులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల లార్వా వృద్ధి చెందకుండా యాంటీ లార్వల్ చర్యలు చేపట్టాలని, ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని తెలిపారు.అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధుల గుర్తింపునకు ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. స్క్రీనింగ్‌లో వ్యాధులు గుర్తించిన వారికి అవసరమైన చికిత్స ప్రారంభించి, క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించారు. రోగుల వివరాలను రికార్డుల్లో మరియు ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.అనంతరం గంభీరావుపేటలోని ఆదిత్య, ఎస్‌ఆర్ ప్రైవేట్ ఆసుపత్రులను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, అనుమతులు, సంబంధిత నిబంధనల అమలును పరిశీలించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం సంబంధిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే, నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు.ఇట్టి కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ హాఫీజ, డాక్టర్ గీతాంజలి, మహేష్ గౌడ్ వైద్య సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

పీహెచ్‌సీలలో వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

health programmesQualitystandardsfollowedimplementationmedicalservicesnational

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

9 Posts

Latest News

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. MSF నాయకత్వంతో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీ కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! రామగుండం పోలీస్ కమిషనరేట్ రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ. గ్రామాల్లో కనిపించని MPTC, ZPTC ఎన్నికల ప్రచారం! పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం. తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!