రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

- రుద్రవరం లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియ పరిశీలన
- సరిహద్దులు, వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
వేములవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మధ్యమానేరు జలాశయానికి సంబంధించిన సరిహద్దులు, గ్రామంలోని పట్టా భూములు, ఇతర ప్రభుత్వ భూముల హద్దులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని, రైతులకు రీ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. భూముల రీ సర్వే విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు.
పరిశీలనలో డీఐ రాజేంద్ర ప్రసాద్, నాయబ్ తహసీల్దార్ లీలారాణి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?













