30/10/2026, Friday · 11:40:10 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు

KOMPELLY BHAGAVAN 30/10/2026 10:01 PM సిద్దిపేట 2

విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు
Want this news as a newspaper clip?Print News Clip
  • బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డి ప్రత్యేక చొరవతో బోరు ఏర్పాటు.

దుబ్బాక - భూంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాఠశాలలో నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ సర్పంచ్ జన్నారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడి బోరును మంజూరు చేయించారు.

మంజూరైన బోరును  బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి సహకరించినట్లు వారు తెలిపారు. పాఠశాలలో తాగునీటి సమస్య తీరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాల్శెట్టి నందం, వార్డు సభ్యులు కొండలు, శ్రీకాంత్, ప్రవీణ్, అక్బర్‌పేట-భూంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మండల కుమార్, భూంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దోమకొండ నర్సింలు, హెడ్‌మాస్టర్ రాజేందర్, రూరల్ వాటర్ వర్క్స్ శ్రీరాములు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు

water problemSolutiondrinkingstudentsBoregrantsBhoompallischool

About the author

KOMPELLY BHAGAVAN

KOMPELLY BHAGAVAN

Constituency Incharge

3 Posts

Latest News

ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష. దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్ పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..