29/10/2026, Thursday · 05:26:14 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

MSF నాయకత్వంతో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీ

P RAJESHKUMAR 29/10/2026 4:46 PM చిత్తూరు 6

MSF నాయకత్వంతో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీ
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్)అక్టోబర్ 29. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరు గ్రామంలో మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) విభాగం గ్రామ కమిటీని అత్యంత ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అభ్యసిస్తున్న మాదిగ విద్యార్థులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించడం, నాయత్వ లక్షణాలు అలవర్చడం మరియు చదువులో రాణించేలా దిశానిర్దేశం చేయడమే ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని మండల యువసేన అధ్యక్షుడు ఎన్.పలని మాదిగ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడంతో పాటు వారి హక్కుల సాధనలో చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, కులమతాలకు అతీతంగా విద్యతోనే ప్రగతి సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రామకుప్పం మండలంలోని మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే MSF కమిటీలను విస్తరిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, గోపాల్, శివకుమార్, విష్ణు, మురుగేష్, మణికంఠ, శీనుతో పాటు పలువురు స్థానిక యువకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ

MSF LeadershipCommitteeStudentAwareness

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

5 Posts

Latest News