29/10/2026, Thursday · 07:44:49 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Teegala sravan Kumar 29/10/2026 6:37 PM రాజన్న సిరిసిల్ల 4

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Want this news as a newspaper clip?Print News Clip
  • చందుర్తి మండలం మూడపెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనుల పరిశీలన.

చందుర్తి మండలం అక్టోబర్ 29, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చందుర్తి మండలం మూడపెల్లిలో టీ జీ ఈ డబ్ల్యూ ఐ డీ సీ ఆద్వర్యంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఆవరణలో నిర్మాణ పనులు కొనసాగుతుండగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అధికారులు ప్రణాళిక ప్రకారం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, తహసీల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Garima AgrawalSpeedconstructionworkDistrictCollector

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

8 Posts

Latest News

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి MSF నాయకత్వంతో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీ కాసిపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! రామగుండం పోలీస్ కమిషనరేట్ రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ. గ్రామాల్లో కనిపించని MPTC, ZPTC ఎన్నికల ప్రచారం! పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం. తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి! సిరిసిల్లలో ‘సంపూర్ణేష్ బాబు’ సందడి!