మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 31.గంగాధరనెల్లూరు పంచాయతీ మోతరాంగనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామస్థులను కలుస్తూ స్థానిక సమస్యలపై చర్చించారు. వైయస్సార్సీపి చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తూ మద్దతు కోరారు. ప్రచార సమయంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి బాధపడుతున్న హరీష్ ను షర్మిల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని ఘనంగా భరోసా కల్పించారు. అభ్యర్థి నేరుగా పరామర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












