04/11/2026, Wednesday · 07:28:38 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

KOMPELLY BHAGAVAN 03/11/2026 11:56 AM సిద్దిపేట 6

దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
Want this news as a newspaper clip?Print News Clip
  • రైతుల సమస్యలపై కలెక్టరేట్లకు వినతిపత్రాలు సమర్పించనున్న బీఆర్ఎస్ నాయకులు.

దుబ్బాక: నియోజకవర్గంలోని రైతుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించబడతాయి.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా సిద్దిపేట, మెదక్ కలెక్టరేట్లలో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నారు.

సిద్దిపేట ఏర్పాటు దుబ్బాక, అక్బర్‌పేట–భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలతో పాటు మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి :: 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

karuvu mamdalalugadubbakaniyojakavargamloniannimamdalalanu

About the author

KOMPELLY BHAGAVAN

KOMPELLY BHAGAVAN

Constituency Incharge

5 Posts

Latest News