03/11/2026, Tuesday · 12:42:04 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

తల్లి మరణం తండ్రి జైలుకు ఏడేళ్ల చిన్నారికి రూరల్ పోలీసుల అండ

suman 02/11/2026 11:28 PM క్రైమ్ 1

తల్లి మరణం తండ్రి జైలుకు  ఏడేళ్ల చిన్నారికి రూరల్ పోలీసుల అండ
Want this news as a newspaper clip?Print News Clip
  • తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగా మిగిలిన ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన కరీంనగర్ రూరల్ పోలీసులు

కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 2


కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగా మిగిలిన ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన కరీంనగర్ రూరల్ పోలీసులు గత నెల 25-10-2026 రాత్రి మగపిల్లవాడు పుట్టలేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్త దావు చంద్రకుమార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. వీరికి గతంలో ఏడేళ్ల వయస్సు గల దావు మహాన్య అనే కుమార్తె ఉంది తల్లి మరణించగా, తండ్రి జైలులో ఉండటంతో చిన్నారి మహాన్య అనాథగా మిగిలింది ఆమెను చూసుకునే బాధ్యత కలిగిన తాత కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చిన్నారి సంరక్షణ, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం కరీంనగర్‌లోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు వెంటనే స్పందించి ఔట్రీచ్ వర్కర్ ఎన్. స్వరూపను పోలీస్ స్టేషన్‌కు పంపించారు. చిన్నారి భవిష్యత్తు, సంరక్షణ, విద్యను దృష్టిలో ఉంచుకొని, ఆమె తాత సమక్షంలో కరీంనగర్ రూరల్ పోలీసులు చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) వారికి అప్పగించారు ఈ సందర్భంగా చిన్నారిని సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ పోలీస్ సిబ్బంది, ప్రజలు ఆమెకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు ఈ మానవీయ కార్యక్రమంలో చొరవ చూపిన ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఔట్రీచ్ వర్కర్ స్వప్నను ప్రజలు అభినందించారు పోలీసుల విధి కేవలం నేరాలను నియంత్రించడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి,అవసరమైన వారికి భరోసా కల్పించడం కూడా పోలీసుల బాధ్యత అని అన్నారు

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

old childMotherdeathfathersentsevenyearjail

About the author

suman

suman

District Incharge

7 Posts

Latest News

21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు. ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం 12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణం. -కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల అభివృద్ధికి బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి