03/11/2026, Tuesday · 12:45:33 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్

Teegala sravan Kumar 02/11/2026 11:36 PM రాజన్న సిరిసిల్ల 1

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్
Want this news as a newspaper clip?Print News Clip
  • కోనరావుపేటలోని గిరిజన ఆశ్రమ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
  • మెనూ, భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో ఆరా

కోనరావుపేట మండలం, నవంబర్ 02,  కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని.. వారి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. 

మెనూ చార్ట్ పరిశీలించి.. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు ఇతర ఆహార పదార్థాలను నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఈ రోజు ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించారు. మెనూ, భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు హాస్టల్ లో వసతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసించాలని, అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్

Garima AgrawalQualitymealsservedpermenuDistrictCollector

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

44 Posts

Latest News

21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు. ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం తల్లి మరణం తండ్రి జైలుకు ఏడేళ్ల చిన్నారికి రూరల్ పోలీసుల అండ 12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణం. -కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల అభివృద్ధికి బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి