31/10/2026, Saturday · 10:43:55 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్

Teegala sravan Kumar 31/10/2026 8:36 PM రాజన్న సిరిసిల్ల 4

యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు

సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్
Want this news as a newspaper clip?Print News Clip
  • హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
  • హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

యూడీఐడీ దరఖాస్తుల పెండింగ్‌ లేకుండా వేగంగా పరిష్కరించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. యూడీఐడీ దరఖాస్తులు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ అంశంపై సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ శనివారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూడీఐడీ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సెర్ప్ నుంచి అన్ని జిల్లా దవాఖానలకు పంపిన వైద్య పరీక్షల యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వచ్చిన రోజే పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు చేసి పంపేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ఆరా తీసి విద్యార్థులకు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో యూడీఐడీ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,590 యూడీఐడీ కార్డులు జారీ చేశామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శరత్, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు

సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్

Divya DevarajanDonkeepUDIDapplicationspendingSerpCEO

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

30 Posts

Latest News

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి. అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం. న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు