02/11/2026, Monday · 07:21:48 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత

Teegala sravan Kumar 02/11/2026 6:17 PM రాజన్న సిరిసిల్ల 4

ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత
Want this news as a newspaper clip?Print News Clip
  • ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం
  • కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ ను అభినందించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించి, మానవత్వం చాటుకున్న బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

పోలీసుల విధులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి, అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మానవత్వం, సేవాభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు.పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

service CommitmentHumanitypublicdutyPolicerealtraitsDistrict

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

39 Posts

Latest News

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి కూకటివేళ్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేద్దాం-కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్. నిఘా నీడలో హరిదాస్ నగర్ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ 41 ఏళ్లుగా కఠోర అనుష్ఠాన దీక్షలో శ్రీ కేదారానంద మహారాజు