03/11/2026, Tuesday · 12:42:21 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

Teegala sravan Kumar 02/11/2026 11:35 PM రాజన్న సిరిసిల్ల 1

చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.
Want this news as a newspaper clip?Print News Clip
  • డివైడర్‌పై అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు..
  • పాదచారులు సైతం రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

 సిరిసిల్ల పట్టణం, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు పరిధిలో గల రెండో బైపాస్ రోడ్డు, సిరిసిల్ల–కోనరావుపేట ప్రధాన రహదారులు కలిసే చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి తెలిపారు. స్థానిక కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు ఈ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆమె సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. చౌరస్తా మధ్యలో ఉన్న రోడ్డు డివైడర్‌పై పెరిగిన చెట్ల కారణంగా వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించడం లేదని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించినట్లు తెలిపారు. వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఈ సమస్యను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలు, వాహనదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, మున్సిపల్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, తమ వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండటంతో పాటు వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. పాదచారులు సైతం రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, మాజీ కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, నర్మెట ప్రభు, తిరుపతి రెడ్డి, మల్లేశం, వీరగోని చందు, కత్తెర రాజు, పరుశురాములు, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

Traffic ChaurasthaMeasurespreventaccidentsChandrapet

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

44 Posts

Latest News

21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం తల్లి మరణం తండ్రి జైలుకు ఏడేళ్ల చిన్నారికి రూరల్ పోలీసుల అండ 12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణం. -కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల అభివృద్ధికి బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి