31/10/2026, Saturday · 03:42:45 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

BHOOM REDDY CH 31/10/2026 2:46 PM రాష్ట్ర వార్తలు 1

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
Want this news as a newspaper clip?Print News Clip
  • వేదమంత్రాలతో వేదాశీర్వచనం
  • దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండరు ఆవిష్కరణ

హైదరాబాద్‌, అక్టోబరు 31,2026:

శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్వన్మహాసభలకు శనివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాదగిరి గుట్టపై ఉన్న అతిథి గృహం వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్, వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా లు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ శ్రీ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను గవర్నర్ గారికి అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండరు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆవిష్కరించారు.

కార్యక్రమంలోమ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

Lakshminarasimha SwamyGovernorcouplevisitsYadagiriguttaSri

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

19 Posts

Latest News

డేటింగ్ యాప్‌ వలలో చిక్కి.. రూ.20 లక్షల బంగారం స్వాహా! తెలంగాణలో ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు: మంత్రి తుమ్మల రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!! భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం..! కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.