న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు

- సమ్మె 19వ రోజుకు చేరింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం సహా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రా ధర్నా ఉద్యోగుల వినతుల నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా చౌక్ నుంచి రగుడు ఎల్లమ్మ గుడి వరకు NHM ఉద్యోగుల బోనాలు ఊరేగించారు. అమ్మ ఎల్లమ్మ దేవునికి వినతిపత్రం సమర్పిస్తూ, తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రార్థించారు. దీర్ఘకాలంగా ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందించినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించబడడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధాన డిమాండ్లు:
NHM కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిం చాలి.క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి.సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు కల్పించాలి.మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, వార్షిక ప్రయోజనాలు, పిఆర్‌సి కొనసాగింపులకు హామీ ఇవ్వాలి. తమలపై ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు, శాశ్వత పరిష్కారం వచ్చే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని NHM ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది NHM కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు కార్మిక సంఘాల నాయకులు కడారి రాములు, కొంపెల్లి విజయ్ కుమార్ అన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?













