31/10/2026, Saturday · 01:39:15 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.

Teegala sravan Kumar 31/10/2026 12:42 PM రాజన్న సిరిసిల్ల 14

అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.
Want this news as a newspaper clip?Print News Clip
  • బెల్ట్ షాపులపై 03 కేసులు నమోదు, 03 డీజే సౌండ్ సిస్టమ్స్ సీజ్.
  • మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.

సిరిసిల్ల:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు.

ఈఆపరేషన్‌లో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానిత ప్రాంతాల్లోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటుగా అనుమానిత వ్యక్తులకు గంజాయి గుర్తింపు కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.

ఈసందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురిపై  కేసులు నమోదు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మందిపై , అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై ఐదు కేసులు నమోదు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న మూడు డీజే సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న రెండు బోర్‌వెల్ లారీలు, ఒక కారుపై కూడా కేసులు నమోదు చేశారు.

ప్రజాభద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈసందర్భంగా డిఎస్పీ  తెలిపారు.

ఈ అపరేషన్ లో సిఐ లు శ్రీనివాస్ , నాగేశ్వరరావు, ఎస్.ఐ లు , సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.
అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.
అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.

illegal activitiesOperationChabutraaimedcontrollingmaintainingpubliclaw

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

22 Posts

Latest News

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న హరీష్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.