కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్

కే24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 3. గంగాధరనెల్లూరు మండలం కోటాగారం ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో వి.హారీష్ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే నవంబర్ ఐదవ తేదీన జరగనున్న పోలింగ్లో ఓటర్లందరూ తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థి వి.హారీష్ ఓటర్లను నేరుగా కలుస్తూ తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లో పింక్ కలర్ పత్రంపై రెండు క్రమ సంఖ్యలో ఉన్న సైకిల్ గుర్తును గుర్తించాలని ఓటర్లకు వివరిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని, తనను గెలిపిస్తే స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభ్యర్థి వ్యక్తిగత చొరవను వివరించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకు గడపగడపకూ తిరుగుతూ మద్దతు కోరుతున్నారు. ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి :: 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె












