31/10/2026, Saturday · 10:47:33 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి.

Teegala sravan Kumar 31/10/2026 8:36 PM రాజన్న సిరిసిల్ల 4

జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, వీబీ జీ రామ్ జీ పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, హౌసింగ్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్ద సంఖ్యలో చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, వీబీజీ రామ్ జీ పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, హౌసింగ్ ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనులు వేగంగా చేయాలి

భూగర్భ జలాల వృద్ధికి వీబీ జీ రామ్ జీ లో భాగంగా తెలంగాణ జలసిరి కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ .. పనులు చేయించాలని సూచించారు. జిల్లాలో పంట కోతలు ముగిసిన వెంటనే పామ్ పాండ్ పనులు రైతులు మొదలుపెట్టేలా అవగాహన కల్పించి పనులు చేయించాలని స్పష్టం చేశారు. వీబీజీ రామ్ జీ లో తెలంగాణ జలసిరి కింద చేపట్టిన పనుల వివరాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా.. ఇప్పటి వరకు ఫామ్ ఫౌండ్ లు 82 పూర్తి అయ్యాయని, బోర్ వెల్ రీచార్జ్ నిర్మాణాలు 102, మ్యాజిక్ సోక్ పిట్లు 237, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలు 18 పూర్తి అయ్యాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను జిల్లాలోని అన్ని మండలాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని డీఆర్డీఓ పేర్కొన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ఆరా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, ప్రారంభమైన నిర్మాణాలు, పూర్తయిన ఇండ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,969 ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని వెల్లడించారు. ముగ్గు పోసిన వారికి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు.

రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను ఆరా తీశారు. ప్రతి ఇంటి నిర్మాణం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

వీబీ జీ రామ్ జీ కింద

వీబీ జీ రామ్ జీ కింద జిల్లాలో 167 వీఓ భవనాల పనులు మొదలు పెట్టగా, 34 పూర్తి అయ్యాయని, మిగతా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ భవనాలు 92 చేపట్టగా 35 నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. అంగన్వాడి భవనాలు 94 చేపట్టగా.. ఇప్పటివరకు 12 పూర్తయ్యాయని మిగతా భవనాల పనులు పురోగతిలో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఇంచార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Indiramma housesJalasiriworkstakenswiftlycompletedearliest

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

30 Posts

Latest News

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం. న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు