31/10/2026, Saturday · 11:27:04 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు

suman 31/10/2026 10:39 PM కరీంనగర్ 1

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు
Want this news as a newspaper clip?Print News Clip
  • అన్నదాత ఆశలపై తెగుళ్లు దాడి

కరీంనగర్ కే 24న్యూస్ అక్టోబర్ 23


వానాకాలంలో పంటలు సాగు చేసిన అన్నదాతలకు కాలం కలిసి రావడం లేదు. వర్షాలు కురవక అరకొరగా సాగు చేసిన పైర్లకు సాగు నీరందక ఎండిపోగా అన్నదాత ఆశలపై తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఫలితంగా పెట్టుబడుల భారం మోపెడవుతుండగా దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మొగి పురుగు ఉధృతితో ఇప్పటికే నాలుగు సార్లు వరి పంటలో క్రిమిసంహారక మందు పిచికారీ చేశారు. పంట కోసే సమయంలో కత్తెర పురుగు సోకి వరి కంకులను కత్తిరిస్తుంది. దీంతో పంట దిగుబడి సగం వరకు తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

పెట్టుబడుల భారం నాలుగింతలు

ఉమ్మడి జిల్లాలో 9.31 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత సీజన్తో పోల్చితే 5.45 శాతం మాత్రమే వరి సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే వరి పొట్ట దశలో వర్షాలు కురవక సుమారు లక్ష ఎకరాల్లో పంట ఎండిపోయిందని అంచనా. ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడులు వెచ్చించారు. పంట సాగు మొదలుకుని మొగి పురుగు, ఆకుఎందు తెగుళ్లు, కంకి నల్లిపురుగు సోకి పంట ఎదుగుదల లేకుండా చేశాయి. సుడి దోమ ఇప్పటికే 20 శాతం పంటకు నష్టం చేశాయి. ఇది చాలదన్నట్టు పంట కోత సమయంలో రెండు రాత్రుల్లోనే కత్తెర పురుగు దాడి చేసి దిగుబడిని భూమి పాలు చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అయిదెకరాల్లో వరి పంట తెగుళ్ల నివారణకు అయిదుసార్లు క్రిమిసంహారక మందులకు రూ.3500, పిచికారీ చేయడానికి రూ.1750 ఖర్చు చేసినట్లు లక్ష్మీదేవిపల్లికి చెందిన మహేష్ అనే రైతు వాపోయారు.

మొదళ్లలో చల్లాలి

కత్తెర పురుగు నివారణకు వరి మొదళ్లలో అర లీటర్ క్లోరోపైరిఫాస్ 2 కిలోల బెల్లం, 10 కిలోల తవుడులో కలిపి చిన్న ముద్దల్లా చేసి వేయాలి. బివేరియా బాసియానా పౌడర్ 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మధ్యాహ్నం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. పొట్ట దశలోనైతే నిండా నీరు పెట్టాలి. దుబ్బులో ఉన్న పురుగులు చనిపోతాయి

-ప్రియదర్శిని ఏడీఏ

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు
చి'వరి'కి కత్తెర పురుగు తెగులు

pest pestScissorchipaddy

About the author

suman

suman

District Incharge

5 Posts

Latest News

జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి. అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం. న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు