ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

- చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
- దేశ ఐక్యత, సమగ్రతకు పటేల్ చేసిన కృషి చిరస్మరణీయం.
రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
పటేల్ ఆలోచనలు, ఆశయాలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ భారతీయులమనే భావనతో ఐకమత్యంగా ఉండాలని, జాతి ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయడమే సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అర్పించే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, ఆర్.ఐ లు సురేష్, రమేష్ సిఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మధుకర్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?













