సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 02. గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు మరియు కోటాగారం పంచాయతీ సెగ్మెంట్ పరిధిలోని నాశంపల్లి, కలిజవేడు, వెంకటాపురం గ్రామల్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కె.హరీష్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంల్లో భాగంగా ముఖ్య అతిధులుగా గంగాధరనెల్లూరు శాసన సభ్యులు VM థామస్ పాల్గొన్నారు. MPTC, ZPTC, MPP అభ్యర్థులు ప్రచారంలో భాగంగా MPP అభ్యర్థి వినోద్, ZPTC అభ్యర్థి స్వామిదాస్ (సతీమణి),అభ్యర్థులు స్థానిక ప్రజలకు TDP ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజల మద్దతు కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు హామీనిచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై MPTC,ZPTC కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్థులు మరియు కూటమి పార్టీ నాయకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.స్థానిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇదీ చదవండి :: ఒకే కుటుంబంలో వరుస విషాదాలు.. 15 రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి!













