31/10/2026, Saturday · 01:38:15 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.

Teegala sravan Kumar 31/10/2026 12:47 PM రాజన్న సిరిసిల్ల 14

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రజా రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల బాధ్యత .

ఎల్లారెడ్డిపేట మండలం, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఈ రోజు ఉదయం ఓ మహిళ అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తున్న బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలు ఈ విషయాన్ని గమనించారు.వెంటనే స్పందించిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళ వద్దకు చేరుకుని మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స అందిస్తూ, ఆమె చేతులు, కాళ్లు రుద్దడంతో కొద్దిసేపటికే ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ తోటి మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే స్పందించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిల లను ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.
మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.

Yellareddypet policeshownhumanity

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

22 Posts

Latest News

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా. విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న హరీష్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.