31/10/2026, Saturday · 01:39:15 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన.

Teegala sravan Kumar 31/10/2026 12:45 PM రాజన్న సిరిసిల్ల 14

సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన.
Want this news as a newspaper clip?Print News Clip
  • సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాస్ సూచన

రాజన్న సిరిసిల్ల జిల్లా ,కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ సీఐ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజు, అభిషేక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

nursing studentsCybercrimeawarenessSiricilla

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

22 Posts

Latest News

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా. విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న హరీష్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.