31/10/2026, Saturday · 04:22:37 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

డేటింగ్ యాప్‌ వలలో చిక్కి.. రూ.20 లక్షల బంగారం స్వాహా!

BHOOM REDDY CH 31/10/2026 3:14 PM జాతీయం 1

డేటింగ్ యాప్‌ వలలో చిక్కి.. రూ.20 లక్షల బంగారం స్వాహా!
Want this news as a newspaper clip?Print News Clip
  • బెంగళూరులో కత్తితో బెదిరించి 226 గ్రాముల ఆభరణాల దోపిడీ
  • డేటింగ్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో చొరబాటు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

బెంగళూరు: ఆన్‌లైన్ డేటింగ్ పరిచయం ఓ వ్యక్తిని దోపిడీకి గురిచేసింది. యాప్‌లో మహిళగా పరిచయమైన వ్యక్తిని ఇంటికి ఆహ్వానించగా.. అతడితో పాటు మరో వ్యక్తి వచ్చి కత్తితో బెదిరించి ఏకంగా రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బెంగళూరులోని చంద్రా లేఔట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 22న చంద్రా లేఔట్‌లోని ఓ ఇంటి యజమాని తన భార్యతో కలిసి ఊరికి వెళ్లాడు. ఇంటి తాళాలను అదే భవనంలోని మరో పోర్షన్‌లో నివసిస్తున్న తన స్నేహితుడికి అప్పగించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో మహిళగా పరిచయమైన వ్యక్తితో కొంతకాలంగా చాటింగ్ చేస్తూ, ఇంటికి రావాలని ఆహ్వానించాడు. అయితే ఇంటికి వచ్చిన వ్యక్తి మాస్క్ తొలగించడంతో ట్రాన్స్‌జెండర్ అని గుర్తించి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

 కత్తితో బెదిరించి.. బీరువా బద్దలుకొట్టి దోపిడీ

అప్పటికే పథకం ప్రకారం వ్యవహరించినట్లుగా భావిస్తున్న మరో వ్యక్తి పది నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో బెదిరించి ఇంటి యజమాని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు తెరిపించి, బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి తలుపులను పగులగొట్టి బీరువాలో భద్రపరిచిన 226 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు. బాధితుడు భయంతో జరిగిన విషయాన్ని వెంటనే వెల్లడించలేకపోయినట్లు సమాచారం.

 రూ.20 లక్షల ఆభరణాలు మాయం.. ఇద్దరి అరెస్ట్

ఊరి నుంచి తిరిగి వచ్చిన ఇంటి యజమాని బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. చోరీకి గురైన 226 గ్రాముల బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నజియా, సయ్యద్ మౌషిన్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. డేటింగ్ యాప్‌ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ దోపిడీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Gold SwahaLakh

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

19 Posts

Latest News

తెలంగాణలో ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు: మంత్రి తుమ్మల రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!! భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం..! కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.