రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన

- బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
- నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












