31/10/2026, Saturday · 10:47:32 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

Teegala sravan Kumar 31/10/2026 9:33 PM రాజన్న సిరిసిల్ల 4

జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.
Want this news as a newspaper clip?Print News Clip
  • చిత్రకళ, హస్తకళల్లో ప్రథమ బహుమతులు సాధించిన సిరిసిల్ల బాలికల పాఠశాల విద్యార్థినులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం మండేపల్లిలోని టీజీ ఎంఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక పోటీల్లో సిరిసిల్ల పీహెచ్‌సీ శ్రీ జెడ్పీఎస్‌ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఇద్దరు విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో చిత్రకళ, సంగీతం, నృత్యం, హస్తకళలు ఇలా నాలుగు విభాగాల్లో పోటీలు జరిగాయి.

ఈ పోటీల్లో పి. అక్షర చిత్రకళ, బి. రుచిత హస్తకళల మొదటి బహుమతులు సాధించారు. విజేత విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్. శారద, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు రమేష్, క్రాఫ్ట్ ఉపాధ్యాయురాలు మానస, తరగతి ఉపాధ్యాయుడు శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతి, సతీష్ బాబు తదితరులు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, వారికి మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

School StudentsTalentShriDistrictLevelArtCulturalCompetitions

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

30 Posts

Latest News

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి. అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం. న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు