01/11/2026, Sunday · 02:33:27 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ఒకే కుటుంబంలో వరుస విషాదాలు.. 15 రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి!

Mosarla Kapil 01/11/2026 1:21 PM సిద్దిపేట 4

ఒకే కుటుంబంలో వరుస విషాదాలు.. 15 రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి!
Want this news as a newspaper clip?Print News Clip
  • అన్న రోడ్డు ప్రమాదంలో మృతి..
  • తమ్ముడు ఫారుక్ మృతితో పెద్ద చీకోడ్‌లో విషాదఛాయలు

దుబ్బాక మండలం పెద్ద చీకోడ్, నవంబర్ 1: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కేవలం 15 రోజుల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహమ్మద్ రఫీ సుమారు 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొని మృతి చెందారు. కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన రఫీ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అయితే అన్న మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన తమ్ముడు మహమ్మద్ ఫారుక్ (30) తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో దుబ్బాక పట్టణ శివారులో ఫారుక్ మృతి చెందడం కుటుంబంలో మరో తీరని విషాదాన్ని నింపింది. ఫారుక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

ఇప్పటికే పెద్ద కుమారుడిని కోల్పోయిన కుటుంబానికి, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కుమారుడు కూడా దూరం కావడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఎప్పుడూ తమతో కలిసిమెలిసి ఉండే ఇద్దరు యువకులు ఇక లేరనే వార్తతో పెద్ద చీకోడ్ గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వరుస విషాద ఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి :: ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం.

father diedbrotherdeeplydisturbeddeathhis

About the author

Mosarla Kapil

Mosarla Kapil

Town Reporter

1 Posts

Latest News

సిరిసిల్ల లో ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం. చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి. అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం.