04/11/2026, Wednesday · 12:40:38 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

మాస్టర్ కె జతిన్ కాపాడానికి వైద్య నిధుల కోసం సహాయం చేయమని తల్లిదండ్రుల ప్రార్థన

P RAJESHKUMAR 04/11/2026 11:50 AM చిత్తూరు 3

మాస్టర్ కె జతిన్ కాపాడానికి వైద్య నిధుల కోసం సహాయం చేయమని తల్లిదండ్రుల ప్రార్థన
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 04. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమురు మండలం జెట్టిగుండ్లపల్లి హరిజనవాడకు చెందిన కె.చందు మరియు కె.జాన్సీ దంపతుల ఒక సంవత్సరం కుమారుడు కె.జతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. వైద్య పరీక్షల్లో అతనికి క్రానిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్ అనే అరుదైన, ప్రాణాంతకమైన రోగనిరోధక లోప వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు సాధారణ జీవితాన్ని గడపాలంటే అత్యవసరంగా అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్టాంట్ చేయాలని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ వైద్య చికిత్స మరియు అనంతర సంరక్షణ కోసం సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న వనరులన్నింటినీ వైద్యం కోసం ఖర్చు చేశారు. ప్రస్తుతం తదుపరి చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేక ఆ తల్లితండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న దాతలు, మానవతావాదులు స్పందించి చిన్నారి జతిన్ ప్రాణాలను కాపాడేందుకు ఆర్థికంగా చేయూతనందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చిన్న సహాయం కూడా ఆ బాలుడికి పునర్జన్మ ప్రసాదిస్తుందని వారు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం సహాయం చేయదలుచుకున్న వారు 8919338515 నంబర్ను సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!

medical grantsPrayerparentshelpsaveMasterJatin

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

16 Posts

Latest News

అంత‌రిక్ష కేంద్రం నుంచి ఓటు వేసిన వ్యోమగాములు కామారెడ్డి మున్సిపాలిటీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదు:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఎల్‌సీడీసీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే.. కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్