02/11/2026, Monday · 07:23:18 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

నిఘా నీడలో హరిదాస్ నగర్

Teegala sravan Kumar 02/11/2026 6:06 PM రాజన్న సిరిసిల్ల 4

నిఘా నీడలో హరిదాస్ నగర్
Want this news as a newspaper clip?Print News Clip
  • కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా 08 సీసీ కెమెరాల ఏర్పాటు.
  • సీసీ కెమెరాలను ప్రారంభించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి.

ఎల్లారెడ్డి పేట మండలం, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామ పంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన 08 సీసీ కెమెరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు.ఈ సందర్భంగా నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటి మరియు నేను సైతం పోసిలింగ్ లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో నిరంతరంగా కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించడం, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను అరికట్టడంతో పాటు నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.గ్రామాల భద్రత ప్రజలందరి బాధ్యత అని, పోలీసులకు ప్రజలు సహకరిస్తూ నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీఎస్పీ కోరారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ వెంకటేష్, ఎస్.ఐ రమేష్ , గ్రామపంచాయతీ పాలక వర్గం , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,ఏఏంసీ చైర్మెన్ దేవానందం,వైస్ చైర్మెన్ నంది కిషన్,పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

నిఘా నీడలో హరిదాస్ నగర్

Haridas NagarVillageshadowsurveillance

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

39 Posts

Latest News

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి కూకటివేళ్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేద్దాం-కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ 41 ఏళ్లుగా కఠోర అనుష్ఠాన దీక్షలో శ్రీ కేదారానంద మహారాజు