ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్

- ఐడీఓసీ ప్రజావాణికి 165 దరఖాస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 165 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 06 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 06 దరఖాస్తు రాగా, ఆయా శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్














