02/11/2026, Monday · 07:23:49 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్

Teegala sravan Kumar 02/11/2026 6:00 PM రాజన్న సిరిసిల్ల 4

క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్
Want this news as a newspaper clip?Print News Clip
  • యువ క్రికెట్ క్రీడాకారిణికి క్రికెట్ కిట్, సామగ్రి అందించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02 కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

క్రికెట్ పోటీల్లో గూడెపు వంశిక ఉత్తమ ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్రం తరఫున జిల్లా నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన గూడెపు వంశిక పాల్గొననున్నది. ఆ క్రీడాకారిణికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పోర్ట్స్ కిట్, సామగ్రి అందజేసి అభినందించారు. నిత్యం సాధన చేయాలని, మంచి ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

Collector UdhampurtalentcricketelevatedhighestpositionsGarimaAgrawal

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

39 Posts

Latest News

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి కూకటివేళ్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేద్దాం-కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్. నిఘా నీడలో హరిదాస్ నగర్ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ 41 ఏళ్లుగా కఠోర అనుష్ఠాన దీక్షలో శ్రీ కేదారానంద మహారాజు