04/11/2026, Wednesday · 09:32:49 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్

Teegala sravan Kumar 04/11/2026 7:46 AM రాజన్న సిరిసిల్ల 1

వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్
Want this news as a newspaper clip?Print News Clip
  • కేతు బచావో అభియాన్, రైతు నేస్తం కార్యక్రమానికి హాజరు

రుద్రంగి మండలం, నవంబర్ 03, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. రుద్రంగి మండలం మానాలలో కేతు బచావో అభియాన్, రైతు నేస్తం కార్యక్రమాలు మంగళవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. రిజర్వాయర్లలోని నీటిని తాగు నీటికి, జీవాల కోసం వినియోగించాలని తెలిపారు. భూగర్భ జలాలు గత ఏడాది తో పోలిస్తే ఇంకా లోతులోకి పడిపోయాయని తెలిపారు. వరి సాగు చేస్తే నీరు బారీగా అవసరమని వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పొడి ఎండ వాతావరణంతో రాను రాను రాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వివరించారు. మానాల రైతులు సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారని, గత సీజన్లో ప్రత్యామ్నాయ పంటల సాగులో ముందున్నారని అభినందించారు. ప్రస్తుత సూపర్ ఎల్ నినో ప్రభావంతో రైతులు నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ చేయాలని పిలుపునిచ్చారు.

వీటి సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వాడి నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ కు టన్ను ధర ప్రస్తుతం 22 వేల 658 ఉందని వెల్లడించారు అలాగే జిల్లాకు దగ్గర్లోనే సిద్దిపేటలో జిల్లాలో ఆయిల్ ప్లాన్ ఫ్యాక్టరీ ఉందని వివరించారు. ఎల్ నినో నేపథ్యంలో రైతులు, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!

వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్

Garima AgrawalAlternativeCropsPaddyCultivationDistrictCollector

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

50 Posts

Latest News

అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదు:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఎల్‌సీడీసీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే.. కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం! ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!