02/11/2026, Monday · 04:48:17 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!!

BHOOM REDDY CH 31/10/2026 2:23 PM అంతర్జాతీయం 1

యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!!
Want this news as a newspaper clip?Print News Clip
  • గసగసాలు, ఖాట్ ఆకులు, తమలపాకులు, వక్కలు నిషేధం
  • AED 60,000 దాటితే నగదు ప్రకటించాలి

దుబాయ్: భారత్ నుంచి యూఏఈకి ప్రయాణించే భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. భారత్‌లో చట్టబద్ధంగా లభించే కొన్ని ఆహార పదార్థాలు, మందులు యూఏఈలో నిషేధిత లేదా నియంత్రిత వస్తువుల జాబితాలో ఉన్నాయని హెచ్చరించింది. తెలియకుండానే వీటిని విమానంలో తీసుకెళ్లితే ఆయా వస్తువుల స్వాధీనం, భారీ జరిమానాలు, అరెస్టు, దేశ బహిష్కరణతో పాటు తీవ్రమైన సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. యూఏఈకి వచ్చే ప్రయాణికులు, అక్కడ నివసిస్తున్న భారతీయులు, ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించాయి.

ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్లకూడదు

యూఏఈలోకి తీసుకురావడంపై నిషేధం ఉన్న వస్తువుల్లో గసగసాలు, ఖాట్ ఆకులు, తమలపాకులు, వక్కలు (సుపారీ), నశ్వార్, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి. వీటిని చెక్-ఇన్ బ్యాగేజీలో కానీ, హ్యాండ్ బ్యాగేజీలో కానీ తీసుకెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.

మందుల విషయంలో మరింత అప్రమత్తత అవసరం

కొన్ని నిద్ర మాత్రలు, నొప్పి నివారణ మందులు, మానసిక ఆరోగ్య చికిత్సకు ఉపయోగించే మందుల్లో నార్కోటిక్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు ఉండవచ్చని ఎంబసీ తెలిపింది. ఇలాంటి మెడిసిన్ ను యూఏఈలో నియంత్రిత లేదా పాక్షికంగా నియంత్రిత మెడిసిన్లుగా పరిగణిస్తారు. ప్రయాణికులు ముందుగా Emirates Drug Establishment అధికారిక వెబ్‌సైట్ (www.ede.gov.ae)లో మెడిసిన్ జాబితాను పరిశీలించాలి. నియంత్రిత మందులు తీసుకెళ్లాల్సిన వారు ప్రయాణానికి ముందే ఆన్‌లైన్ ద్వారా వ్యక్తిగత వినియోగానికి మందుల దిగుమతి అనుమతి (Import Permit for Personal Use of Medicine) పొందాలి. దీని కోసం డిజిటల్ ఐడెంటిటీతో లాగిన్ అయి దరఖాస్తు ఫారం నింపడంతో పాటు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా వైద్య నివేదికను అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా ఒక పని దినంలో అనుమతి ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సేవ ఉచితం. సహాయం కోసం 800-33784 హెల్ప్‌లైన్ లేదా info@ede.gov.ae ద్వారా సంప్రదించవచ్చు.

భారత్‌లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో చట్టబద్ధంగా పొందిన మెడిసిన్ అయినా యూఏఈలో అనుమతి లేకుండా తీసుకెళ్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ తీసుకెళ్లడం, అనుమతించిన పరిమితికి మించి నిల్వ ఉంచడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మెడిసిన్ స్వాధీనం, అరెస్టు, విచారణ, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

పూర్తిగా నిషేధించిన వస్తువులు

మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలు, నకిలీ కరెన్సీ, పైరసీ వస్తువులు, జూదానికి ఉపయోగించే పరికరాలు, మూడు పొరల నైలాన్ చేపల వలలు, చేతబడి, మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులు, ప్రమాదకర లేదా రేడియోధార్మిక కాలుష్యానికి గురైన పదార్థాలను యూఏఈలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధం.

ముందస్తు అనుమతి అవసరమైన వస్తువులు

ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, బాణసంచా, జీవ జంతువులు, మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మెడిసిన్స్, వైద్య పరికరాలు, ప్రచురణలు, రికార్డు చేసిన మీడియా, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్లు, కమ్యూనికేషన్, GPS పరికరాలు, మద్యం, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు, వాహన టైర్లు, సౌందర్య సాధనాలు, కొన్ని విద్యుత్ పరికరాలు, అణు, రేడియోధార్మిక పదార్థాలు, ముడి వజ్రాలు తీసుకెళ్లాలంటే సంబంధిత యూఏఈ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.

AED 60,000 దాటితే నగదు ప్రకటించాలి

ప్రయాణికులు తమ వెంట నగదు, బేరర్ చెక్కులు వంటి ఆర్థిక సాధనాలు, బంగారం వంటి విలువైన లోహాలు, రత్నాలు కలిపి AED 60,000 కంటే ఎక్కువ విలువైనవి తీసుకెళ్తే యూఏఈ కస్టమ్స్ అధికారులకు తప్పనిసరిగా ప్రకటించాలి. ఇతర కరెన్సీల్లో సమాన విలువ ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రయాణికులకు ఎంబసీ సూచనలు

ప్రయాణానికి ముందు తమ బ్యాగేజీని పూర్తిగా తనిఖీ చేసుకోవాలని, నిషేధిత లేదా నియంత్రిత వస్తువులు అనుమతి లేకుండా తీసుకెళ్లవద్దని భారతీయులకు సూచించింది. ఇతరుల కోసం వారి బ్యాగులు లేదా లగేజీ తీసుకెళ్లే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అందులో ఏమున్నాయో పూర్తిగా తెలుసుకోకుండా ఇతరుల లగేజీని తీసుకెళ్లకూడదని స్పష్టం చేసింది.

నిషేధిత, నియంత్రిత వస్తువులు, మెడిసిన్స్ కు సంబంధించిన తాజా పూర్తి వివరాల కోసం ప్రయాణానికి ముందే యూఏఈ ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ, దుబాయ్ కస్టమ్స్, అబుదాబి కస్టమ్స్, Emirates Drug Establishment అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

kilaka hechcharikayueikivellebharatiyulakuembasi

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

21 Posts

Latest News

టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్ విజ్ఞాన్ స్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ పథకం పేరుతో భారీ అక్రమాలు: TGVP ఒకే కుటుంబంలో వరుస విషాదాలు.. 15 రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి! సిరిసిల్ల లో ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం. చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్