02/11/2026, Monday · 08:06:07 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి.

Teegala sravan Kumar 02/11/2026 6:56 PM రాజన్న సిరిసిల్ల 4

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • మంగళవారం సిరిసిల్లలో భారీగా సాంస్కృతిక వేడుకలు..
  • అన్ని పార్టీల నాయకులు, జానపద కళాకారుల హాజరు.

 సిరిసిల్ల పట్టణం, నవంబర్ 02,  కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

తెలంగాణ జానపద కళాకారుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను మంగళవారం సిరిసిల్లలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం ఇన్‌చార్జి ఎండీ సత్తార్ తెలిపారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

జానపద కళలకు, కళాకారులకు గుర్తింపు తీసుకురావడంతో పాటు వారి ఐక్యతకు ఈ ఆవిర్భావ సభ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రజలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎండీ సత్తార్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి.

Folk IndustryemergenceTelanganasuccessful

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

41 Posts

Latest News

12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణం. -కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల అభివృద్ధికి బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి కూకటివేళ్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేద్దాం-కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్. నిఘా నీడలో హరిదాస్ నగర్ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్